ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను మభ్యపెడుతుంది' - news sc,st's

వైకాపా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను మభ్యపెడుతుందని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు ఆరోపించారు. సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించి ఎస్సీ, ఎస్టీ సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AIICC member narasimha rao on ysrcp goevernment
ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు

By

Published : Jul 9, 2020, 4:30 PM IST

ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలను ఆదుకోవడానికి బడ్జెట్లో మంజూరు చేసిన సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించారని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు మండిపడ్డారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని గాలికొదిలేశారని నరసింహారావు అన్నారు. కేవలం రూ.10 వేలు ఇచ్చి వెనుకబడిన వర్గాలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఉపాధి కింద ఒక్క ఎస్సీ, ఎస్టీకైనా కనీసం లక్ష రూపాయలైనా ఇచ్చారా అని నిలదీశారు.

రైతు దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు వైకాపా ప్రభుత్వానికి లేదని నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు చెల్లింపులు జరపాలని నరసింహారావు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details