ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరిగిందని ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్ పేర్కొన్నారు. వ్యాధి చాలా వరకు తగ్గుముఖం పట్టిందన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా... ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. బాధ్యత కలిగిన ప్రతీఒక్కరు ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాధి సోకిన వారందరికి పింఛన్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఎయిడ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని సదస్సుకు హాజరైనవారితో ప్రతిజ్ఞ చేయించారు.
ఎయిడ్స్ సోకిన వారికి మనోధైర్యం కల్పించాలి: ఆళ్ల నాని - deputy cm alla nani speaks on aids latest news
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఉపముఖ్యమంత్రి ఆళ్ళ నాని పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధి సోకిన వారికి అందరితో జీవించేందుకు మనోధైర్యం కల్పించాలని సూచించారు.

ఎయిడ్స్ సోకిన వారికి మనోధైర్యం కల్పించాలన్న ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని
ఎయిడ్స్ సోకిన వారికి మనోధైర్యం కల్పించాలి: ఆళ్ల నాని
ఇదీ చదవండి: డిసెంబర్ 8న వ్యవసాయరంగ సంక్షోభంపై సదస్సు