ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దాతలు భక్తితో ఇస్తే.. చులకన చేస్తారా?' - ttd proparties acution news

విజయవాడలో ఏఐసీసీ సభ్యులు న్యాయవాది నరాల శెట్టి నరసింహారావు నిరాహార దీక్షకు దిగారు. తితిదే ఆస్తుల వేలం నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్వామివారు ఆస్తులు కాపాడలేనివారికి.. ఆ పదవుల్లో ఉండే అర్హత లేదన్నారు.

aicc members protest
ఏఐసీసీ సభ్యులు నరాల శెట్టి నరసింహారావు నిరాహార దీక్ష

By

Published : May 24, 2020, 4:08 PM IST

తితిదే ఆస్తుల వేలం నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ సభ్యులు, న్యాయవాది నరాల శెట్టి నరసింహారావు విజయవాడలో నిరాహార దీక్షకు దిగారు. భక్తులు ఎంతో పవిత్ర భావంతో ఇచ్చిన ఆస్తులను చులకన చేస్తూ తితిదే తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు.

'స్వామి వారి ఆస్తులను కాపాడలేని మీకు పదవుల్లో కొనసాగే అర్హత లేదు. తక్షణమే ఆ పదవుల నుంచి వైదొలగండి' అని వ్యాఖ్యానించారు. స్వామివారి ఆస్తుల వేలం నిర్ణయాలను ఉపసంహరించుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని నరసింహారావు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details