ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాపై చిన్నచూపు వద్దు: అగ్రిగోల్డ్ బాధితులు - కృష్ణాజిల్లా తాజా వార్తలు

తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎమ్మార్వోలకు వినతిపత్రాలు ఇచ్చారు. సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమానికి సిద్దమవుతామని వారు హెచ్చరించారు.

విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల నిరసన
విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల నిరసన

By

Published : Sep 28, 2020, 3:12 PM IST

బాధితులను ఆదుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ విజయవాడలో అన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందించినట్లు ఆయన తెలిపారు.

నేటికి బాధితులకు కేవలం 239 కోట్లు మాత్రమే అందించగా... రెండవ బడ్జెట్ లో 200 కోట్లను మాత్రమే కేటాయించటంలో మర్మమేమిటని ప్రశ్నించారు. పేదలకు వేల కోట్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం... తమపై చిన్నచూపు చూడటం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details