ఆంధ్రప్రదేశ్

andhra pradesh

kannababu: రైతుల కోసం 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు: మంత్రి కన్నబాబు

By

Published : Jun 22, 2021, 6:43 AM IST

వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,584 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి కన్నబాబు(minister kannababu) తెలిపారు. రైతుల కోసం 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో 25 నూతన రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

Minister Kannababu review meeting
మంత్రి కన్నబాబు సమీక్ష

రాష్ట్రంలో రైతుల కోసం 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు (minister kannababu) స్పష్టం చేశారు. రూ.1,584 కోట్లతో వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తొలిదశలో రూ.659 కోట్లతో 1,255 కేంద్రాలు, రెండవ దశలో రూ.925 కోట్లతో 1,276 బహుళ ప్రాయోజిత కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి తొలిదశ పనులకు 4 ప్యాకేజిల్లో టెండర్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించారన్నారు. వచ్చే నవంబర్ నాటికి వీటి తొలి దశ నిర్మాణాలను పూర్తి చేసి.. ఖరీఫ్ నుంచే రైతులకు సేవలను అందిస్తామని పేర్కొన్నారు.

వ్యవసాయ పనిముట్ల పంపిణీ కోసం మొదటి దశ కస్టమ్ హైరింగ్ సెంటర్లు ,తొలిదశ సమీకృత టెస్టింగ్ ల్యాబ్లను, ఆర్బీకే శాశ్వత భవనాలను సీఎం జగన్ జులై 8 తేదీన ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్ల ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదాముల ఏర్పాటుకు సంబంధించి భూముల ఎంపిక, నిర్మాణాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జేసీలు త్వరిత గతిన చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో మరో 25 నూతన రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

ఇదీ చదవండి

'మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details