కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజీ గూడెం గ్రామంలో వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ పర్యటించారు. దావాజీగూడెం గ్రామ పరిధిలోని పొలాలని పరిశీలించి.. స్ధానిక రైతులకు.. ఈ - క్రాప్ విధానం పై అవగాహన కల్పించారు. రైతుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల పంట దిగిబడి, వడిదుడుకులపై ప్రభుత్వం వద్ద సమగ్ర సమాచారం అందుబాటులో ఉండటం వలన రైతులు దళారుల చేతులో పడి మోసపోకుండా చూస్తామన్నారు. గిట్టుబాటు ధరల వచ్చేలా ప్రభుత్వమే చర్యలు తీసుకునే విధానమే ఈ క్రాప్ విధానమని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ రైతులకు వివరించారు. ఈ పర్యటనలో అరుణ్ కుమార్ తో పాటు జాయింట్ కలెక్టర్ మాధవి లత, సబ్ కలెక్టర్ ధ్యాన్ చందన్ లు పాల్గొన్నారు.
ఈ - క్రాప్‌తో రైతులకు న్యాయం జరుగుతుంది: వ్యవసాయ శాఖ కమిషనర్
వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ కృష్ణాజిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రాప్ విధానం గురించి రైతులకు వివరించారు. రైతుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.
Agriculture Commissioner