పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీర్లు గత నాలుగు రోజులుగా చేస్తున్న ఆందోళనను మంగళవారం రాత్రి విరమించారు. విజిలెన్స్ విచారణపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంజినీర్లపై ఎలాంటి చర్యలు ఉండవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లు ఐకాస నేతలు తెలిపారు. ఇంజినీర్ల ఐకాస ఛైర్మన్ వీవీ మురళీకృష్ణనాయుడు, ప్రధాన కార్యదర్శి జి.హనుమంతరావు, ఇతర నేతలతో మంత్రి పెద్దిరెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, చీఫ్ ఇంజినీర్ సుబ్బారెడ్డిలు విజయవాడలో మంగళవారం రాత్రి చర్చలు జరిపారు. బుధవారం నుంచి విధులకు హాజరవుతామని నేతలు వివరించారు.
పంచాయతీరాజ్ ఇంజినీర్ల ఆందోళన విరమణ - పీఆర్ ఇంజినీర్ల ఆందోళన వాయిదా
మంత్రి పెద్దిరెడ్డితో జరిగిన చర్చలు సఫలం అయ్యాయని ఫంచాయతీ రాజ్ ఇంజినీర్ల సంఘం తెలిపింది. విధుల్లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
![పంచాయతీరాజ్ ఇంజినీర్ల ఆందోళన విరమణ agitation postponed by pr engineers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7551158-626-7551158-1591752330222.jpg)
పీఆర్ ఇంజినీర్ల ఆందోళన వాయిదా