ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేపల చెరువులు తవ్వకూడదంటూ రామన్నగూడెం ప్రజల ఆందోళన - నిరసన వార్తలు

పంట పొలాలను చేపల చెరువులుగా మార్చకూడదంటూ వ్యవసాయ కూలీలు, స్థానికులు ఆందోళన చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రామన్నగూడెం ప్రజలు చెప్పారు.

agitation of ramannagudem villagers
రామన్నగూడెం ప్రజల ఆందోళన

By

Published : Feb 28, 2021, 1:20 PM IST

పంట పొలాలు ఉన్న చోట చేపల చెరువులు తవ్వకూడదంటూ కృష్ణా జిల్లా రామన్నగూడెం గ్రామ ప్రజలు ఆందోళన చేశారు. చిన్న, సన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతారని ఆవేదన చెందారు.

గ్రామస్థులంతా పొలాల వద్ద నిరసన తెలియచేశారు. ఎన్ని అనుమతులిచ్చినా.. చెరువుల తవ్వకానికి ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details