కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడులో రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నిరసన వ్యక్తం చేశారు. కాగాడాలతో రైతులంతా నిరసన ప్రదర్శన చేపట్టారు. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతిని సాధించటానికి ప్రాణాలైనా అర్పిస్తామని రైతులు నినదించారు.
ప్రాణాలైనా అర్పిస్తాం... అమరావతి సాధిస్తాం - తుర్లపాడులో అమరావతి కోసం కాగడాల నిరసన
మూడు రాజధానుల ప్రభుత్వ ప్రకటనపై అమరావతి ప్రాంతంలో నిరసనల హోరు తగ్గటం లేదు. తుర్లపాడులో రైతులంతా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు.
ప్రాణాలైనా అర్పిస్తాం... అమరావతి సాధిస్తాం