ఆంధ్రప్రదేశ్

andhra pradesh

378వ రోజూ కొనసాగిన రాజధాని గ్రామాల్లో నిరసనలు

By

Published : Dec 29, 2020, 9:53 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 378 వ రోజూ రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి. కృష్ణాయపాలెంలో మన్నవ దీప్తి అనే బాలిక తన 8వ పుట్టినరోజు వేడుకను నిరసన దీక్షలోని చిన్నారుల మధ్య జరుపుకొంది.

people aggitate for amaravati
378 వ రోజూ కొనసాగిన రాజధాని గ్రామాల్లో నిరసనలు

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 378వ రోజు కొనసాగాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అనంతవరం, ఉద్ధండరాయునిపాలెంలో రైతులు, మహిళలు ర్యాలీ చేశారు. మందడం, వెంకటపాలెంలోని శిబిరాలలో రైతులు అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

8వ పుట్టినరోజు నిరసన దీక్షలో జరుపుకుంటున్న దీప్తి

కృష్ణాయపాలెంలో మన్నవ దీప్తి అనే బాలిక తన 8వ పుట్టినరోజు వేడుకను నిరసన దీక్షశిబిరంలో చిన్నారుల మధ్య జరుపుకొంది. అమరావతే ఆంధ్రుల రాజధానిగా కొనసాగాలని కోరుకుంటున్న అందరి సమక్షంలో తన జన్మదిన వేడుకలు నిర్వహించుకుంది.

ABOUT THE AUTHOR

...view details