ప్రముఖ హాస్యనటుడు శకలక శంకర్.. కరోనా పరిత్కర పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న పేదలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా విజయవాడ బెంజి సర్కిల్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి ప్రజలనుంచి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విజయవాడలో బెంజి సర్కిల్ నుంచి బీసెంట్ రోడ్డు వరకు రోడ్డుపై తిరుగుతూ... ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. దాతలు ముందుకు వచ్చి తమవంతు సాయాన్ని అందించారు. ఇప్పటికే తెలంగాణలోని కరీంనగర్లో ఈ తరహా కార్యక్రమాన్ని నిర్విహించి పేదలకు సాయం చేశానని... విజయవాడలో 2 రోజులు విరాళాలు సేకరించి నిరుపేదలకు సాయం అందిస్తామని శకలక శంకర్ తెలిపారు.