సినీ హీరో సాయి ధరమ్ తేజ్ విజయవాడలో సందడి చేశారు. సినిమా చిత్రీకరణలో భాగంగా నగరం వచ్చిన ఆయన, వాంబేకాలనీలో ఉన్న అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. నిర్వహణ సహాయార్థం రూ.6లక్షలు విరాళం అందజేశారు. స్నేహితుల ప్రోత్సాహం, అభిమానుల సహకారంతో మున్ముందు మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.
విజయవాడలో సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ సందడి.. వృద్ధాశ్రమానికి విరాళం - విజయవాడ వార్తలు
విజయవాడలో సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ సందడి చేశారు. వాంబేకాలనీలో ఉన్న అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమాన్ని సందర్శించి సహాయార్థం రూ.6లక్షలు విరాళం అందజేశారు. మున్ముందు మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. పైరసీని తరిమికొట్టి థియేటర్లలో సినిమాలు చూడాలని ఆశ్రమం వద్దకు వచ్చిన అభిమానులను కోరారు.

actor sai dharam thej donatedactor sai dharam thej donated
కరోనా అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా హాళ్లకు అనుమతినివ్వటం హర్షణీయమన్నారు. త్వరలో తాను నటించిన సోలో బతుకే సోబెటర్ సినిమా విడుదల కానునుందని వెల్లడించారు. ఆశ్రమానికి వచ్చిన సాయి ధరమ్ తేజ్‌ను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. పైరసీని తరిమికొట్టి థియేటర్లలో సినిమాలు చూడాలని అభిమానులను ఆయన కోరారు.
వృద్ధాశ్రమానికి సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ విరాళం
ఇదీ చదవండి: పనికిరాని పదవులతో బీసీల కడుపు నిండదు: కొల్లు రవీంద్ర