'ఆలయంలో భౌతికదూరం పాటించేలా చర్యలు' - mopidevi temple at krishna district
రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో... భక్తులు భౌతికదూరం పాటించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పక పాటించాలని అధికారులు భక్తులను కోరారు.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని శ్రీవల్లి, దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో... భక్తులు ఆరడుగుల దూరంలో ఉండే విధంగా మార్కింగ్ వేస్తున్నారు. గతంలో ఉన్న క్యూలైన్లోనూ మార్పులు చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. నిబంధనలు భక్తులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించినవారి పేరున పూజలు నిర్వహిస్తున్నామని ఈవో జి.వి.డి.యన్ లీలా కుమార్ తెలిపారు.