ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ: గ్రేటర్​ ఎన్నికలకు సర్వం సిద్ధం - ghmc schedule 2020

తెలంగాణలో గ్రేటర్​ ఎన్నికల కోసం పోలింగ్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కరోనా ప్రభావం​ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ghmc elections
గ్రేటర్​ ఎన్నికలకు సంసిద్ధం

By

Published : Nov 29, 2020, 2:04 PM IST

డిసెంబర్ 1న గ్రేటర్​ హైదరాబాద్​లో జరగనున్న పోలింగ్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గ్రేటర్​లోని 9,101 పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఎలా వేయాలో వివరిస్తూ వీడియో ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవేశద్వారంలో శానిటైజర్ ఏర్పాటు చేశారు. ఓటు వేసేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు సూచించారు. పోలింగ్ సిబ్బందికి సైతం కరోనా కిట్లు అందించారు. కరోనా నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details