మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 38 మందికి విజయవాడ న్యాయస్థానం జైలు శిక్ష , జరిమానా విధించింది. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డైవ్ చేపట్టారు. డ్రైవ్లో నమోదు చేసిన 38 కేసుల్లో 7వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ కె. సురేష్ బాబు జైలు మరియు రూ.76,000ల జరిమానా విధించారు. వీటిల్లో 3 కేసుల్లో 10 రోజుల జైలు శిక్ష, జరిమానా, 5 కేసుల్లో 7 రోజుల జైలు శిక్ష, జరిమానా, 3 కేసుల్లో 5 రోజుల జైలు శిక్ష, జరిమానా, 8 కేసుల్లో 4 రోజుల జైలు శిక్ష, జరిమానా, 3 కేసుల్లో 3 రోజుల జైలు శిక్ష, జరిమానా, 13 కేసుల్లో 2 రోజుల జైలు శిక్ష.. జరిమానా, 1 కేసులో 1 రోజు జైలుశిక్ష.. జరిమానా, 1 కేసులో జరిమానా విధిస్తూ 7వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు.
కేసుల సంఖ్య | శిక్ష |
3 కేసులు | 10 రోజులు జైలు శిక్ష, జరిమానా |
5 కేసులు | 7 రోజులు జైలు శిక్ష, జరిమానా |
3 కేసులు | 5 రోజులు జైలు శిక్ష, జరిమానా |
8 కేసులు | 4 రోజులు జైలు శిక్ష, జరిమానా |
3 కేసులు | 3 రోజులు జైలు శిక్ష, జరిమానా |
13 కేసులు | 2 రోజులు జైలు శిక్ష, జరిమానా |
1 కేసు | ఒక రోజు జైలు శిక్ష, జరిమానా |
1 కేసు | జరిమానా |