తెదేపా అడ్డుకుంది పోలీసుల విధులను కాదు.. వైకాపా రిగ్గింగ్‌ను అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికలయ్యాక కూడా వైకాపా కక్ష సాధింపులకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
'వైకాపా రిగ్గింగ్‌ను అడ్డుకున్నాం.. పోలీసుల విధులను కాదు' - achennaidu on municipal elecitons
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. తెదేపా వైకాపా రిగ్గింగ్‌ను అడ్డుకుందని.. పోలీసుల విధులను కాదని అన్నారు.
achennaidu fires on ysrcp government on tdp leaders arrest
"వైకాపా అక్రమాలు పోలీసులకు కనిపించట్లేదా. తెదేపాకు వర్తించిన సెక్షన్లు అధికార పార్టీకి వర్తించవా. పచ్చని పొలాలు తగలబెట్టి ఆర్థికంగా చిదిమేస్తున్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు తొందరలోనే వస్తుంది." -అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: రవీంద్ర అరెస్టు: మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం