ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పును కప్పిపుచ్చుకోవటానికే తెదేపాపై నిందలు - comments

తెదేపా హయాంలో తిరుపతిలో అన్యమతానికి సంబంధించిన టికెట్లు ఎక్కడా సరఫరా చేయలేదని తెదేపా నేత అచ్చెన్నాయుడు తెలిపారు.

అచ్చెన్నాయుడు

By

Published : Aug 23, 2019, 9:57 PM IST

వైకాపా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే తెదేపాపై నిందలు మోపుతోందని తెదేపా నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తిరుమల- తిరుపతిలో అన్యమత ప్రచారానికి సంబంధించిన టికెట్లను ఎక్కడా పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలను ఖండించారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం వైకాపాకి ఉన్న దురాలవాటన్నారు. నెల్లూరు టిక్కెట్లు తిరుమల వెళ్లాయంటారు... గత ప్రభుత్వం ముద్రించింది అంటారు. ఇందులోనే వైకాపా మంత్రుల మాటల్లోని డొల్లతనం బయట పడిందని అచ్చెన్నాయుడు తెలిపారు. భక్తులకు క్షమాపణ చెప్పకుండా తెదేపాని విమర్శించడం దివాలాకోరుతనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని... తాడేపల్లి వద్ద గోశాలలో 120కిపైగా గోవులు చనిపోవటం వెనుక ఉన్నదెవరని ప్రశ్నించారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో అన్యమతస్థులకు దుకాణాలు కట్టబెట్టడం ద్వారా ఘర్షణలను ప్రేరేపించింది ఎవరని నిలదీశారు.

అచ్చెన్నాయుడు

ABOUT THE AUTHOR

...view details