కృష్ణాజిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి - గొల్లపల్లి
తెల్లవారు జామున జరిగిన ప్రమాదం ఒకరి ప్రాణాలు బలి తీసుకుంది. మరో ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టింది. కృష్ణాజిల్లా గొల్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి