ఇసుక క్వారీలో ప్రమాదం.. వ్యక్తికి తీవ్రగాయాలు - ఇసుక క్వారీలో ప్రమాదం..వ్యక్తి తీవ్రగాయాలు !
ఇసుక క్వారీలో ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో నెలకొన్న ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని విజయవాడ గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు.
ఇసుక క్వారీలో ప్రమాదం..వ్యక్తి తీవ్రగాయాలు !
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయి గూడెం ఇసుక క్వారీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక డంపింగ్ చేస్తుండగా.. లారీ వెనుక డోర్ తీసే క్రమంలో ఇసుక ఒక్కసారిగా మీద పడినట్లు తెలిసింది. ప్రమాదంలో సుబ్బయ్యగూడెం గ్రామానికి చెందిన ముంగి విజయ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని విజయవాడ గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు.