విజయవాడ నగర శివారు ప్రసాదంపాడు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రసాదం పాడు కూడలి నుంచి కానూరు వైపు వెళ్తున్న టిప్పర్ లారీని గన్నవరం వైపు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారి పై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.