Accident: కృష్ణా జిల్లా తాడంకి పైవంతెన వద్ద ప్రమాదం.. ఇద్దరు మృతి - కృష్ణా జిల్లా తాడంకి పైవంతెన వద్ద ప్రమాదం
08:43 April 20
ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుకనుంచి ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
Accident: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం తాడంకి పైవంతెన వద్ద ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్‌ను.. ఓ ట్రావెల్స్ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి యానాం వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనపై పమిడిముక్కల పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
SEXUAL HARASSMENT : విద్యార్థునుల పాలిట కీచకుల్లా అధ్యాపకులు.. వెకిలి చేష్టలతో వేధింపులు
TAGGED:
ap latest news