ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాకు పట్టిన దాడుల దాహాన్ని త్వరలోనే తీరుస్తాం: అచ్చెన్నాయుడు

నూజివీడులో తెదేపా కార్యకర్తలపై దాడి ఘటనలో నిందితులపై తక్షణమే కేసు నమోదు చేసి శిక్షించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. శాంతిభ్రదతలపై డీజీపీకి విశ్వాసం ఉంటే నిందితులను శిక్షించాలన్నారు.

acchenna comments on nuziveedu attack
వైకాపాకు పట్టిన దాడుల దాహాన్ని త్వరలోనే తీరుస్తాం

By

Published : Jul 18, 2021, 1:26 PM IST

కృష్ణా జిల్లా నూజివీడులో తెదేపా కార్యకర్తలు మణి, నాగబాబుపై వైకాపా నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తక్షణమే నిందితులపై కేసు నమోదు చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. వైకాపాకు పట్టిన దాడుల దాహాన్ని త్వరలోనే తీరుస్తామని అచ్చెన్న హెచ్చరించారు. తెదేపా కార్యకర్తలు ఫిర్యాదు చేసినా..కేసు నమోదు చేయలేదన్నారు. బాధితులపైనే కేసులు పెట్టే సంప్రదాయానికి వైకాపా ప్రభుత్వం నాంది పలికారని ఆక్షేపించారు. పోలీసులు వేసుకుంది నీలి చొక్కాలు కాదనేది గ్రహించాలని హితవు పలికారు. శాంతిభ్రదతలపై డీజీపీకి విశ్వాసం ఉంటే నిందితులను శిక్షించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.

ఏం జరిగిందంటే..

కృష్ణా జిల్లా నూజివీడులో వైకాపా, తెదేపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల వేదికగా ఇరు పార్టీల కార్యకర్తలు వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టింగ్‌లపై వాదనలు ఘర్షణకు దారి తీశాయి. వైకాపా కార్యకర్తల దాడిలో ఇద్దరు తెదేపా నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. అధికార పార్టీ నాయకుల గుండాగిరి అరికట్టాలని నూజివీడు నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిoచి ఆందోళన చేపట్టారు.

ఇదీ చదవండి

తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details