ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ టౌన్‌ ప్లానింగ్ అధికారి ఇంట్లో అనిశా సోదాలు - విజయవాడ టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో అనిసా సోదాలు

అనిశా వలలో మరో భారీ చేప చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్ ప్లానింగ్ అధికారి మురళీగౌడ్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.14 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

acb

By

Published : Nov 6, 2019, 5:42 PM IST

Updated : Nov 6, 2019, 8:23 PM IST

టౌన్‌ ప్లానింగ్ అధికారి ఇంట్లో అనిసా సోదాలు

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టౌన్‌ ప్లానింగ్ అధికారి మురళీగౌడ్‌పై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు ఏక కాలంలో 6 చోట్ల తనిఖీలు నిర్వహించారు. మురళీగౌడ్ తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో... అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా పనిచేసే సమయంలో వచ్చిన ఫిర్యాదు మేరకు.. అనిశా అధికారులు తిరుపతి నుంచి వచ్చి సోదాలు చేశారు. ఇప్పటివరకూ... హైదరాబాద్‌ లో 3 అంతస్తుల భవనం, నంద్యాలలో ఒక ఇల్లు, ఓర్వకల్లులో 8 ఎకరాల వ్యవసాయ భూమి, తిరుపతిలో ఇళ్ల స్థలాలు గుర్తించారు. రూ.14 లక్షల నగదు, లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఒక కారు.. 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇష్టారాజ్యంగా అనుమతులు

తిరుపతిలో పనిచేస్తోన్న కాలంలో మురళిగౌడ్​ ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలకు అనుమతులిచ్చినట్లు తమకు ఫిర్యాదులు అందాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ఆయనతో అదే విభాగంలో టీపీఎస్​గా పనిచేసిన శారద మధ్యవర్తిత్వంతో వసూళ్ళకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంటిపైనా దాడులు జరిపామన్నారు.

ఇవీ చదవండి:

నేతల తప్పులకు అధికారులను బలిచేస్తారా?: యనమల

Last Updated : Nov 6, 2019, 8:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details