కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి ఎస్సీ బాలికల వసతి గృహంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.హాస్టల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత లోపించినట్లు వారు గుర్తించారు.పిల్లలకు ఇస్తున్న స్కిన్ లెస్ చికెన్,గుడ్లు,పాలు తదితర ఆహారాన్ని తక్కువ మోతాదులో ఇస్తున్నట్లు గుర్తించారు.వంట సరుకులు నిర్వహణలో కూడా లోపాలున్నాయని,అన్నింటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సాయి కృష్ణ తెలిపారు.
బాలికల వసతి గృహంలో ఏసీబీ తనిఖీలు - search
ముదినేపల్లి ఎస్సీ బాలికల వసతి గృహంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, వాస్తవానికి చాలా తేడా ఉందని అధికారులు గుర్తించారు.
ఏసీబీ తనిఖీలు