విజయవాడ నగరంలోని పటమట మున్సిపల్ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ... అనిశా అధికారులకు చిక్కాడు. తన తండ్రి పేరిట ఉన్న 3ఫ్లాట్లను తన పేరిట మార్చాలని ఓ మహిళ దరఖాస్తు చేసుకుంది. మ్యుటేషన్ చేసి రికార్డుల్లో పేరు మార్చేందుకు రూ. 9 వేల లంచం ఇవ్వాలని ఆమెను జూనియర్ అసిస్టెంట్ పొన్నపల్లి సూర్య భగవాన్ డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వటానికి ఇష్టంలేని మహిళ అనిశా అధికారులను ఆశ్రయించింది. పథకం ప్రకారం... ఆమె లంచం ఇస్తుండగా... అధికారిని అవినీతి నిరోధక శాఖాధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు అనిశా అధికారులు తెలిపారు.
హోదాలో జూనియర్ అసిస్టెంట్.... అవినీతిలో సీనియర్... - అనిశా వలలో ప్రభుత్వ అధికారి
విజయవాడ పటమటలోని మున్సిపల్ కార్పోరేషన్ సర్కిల్ కార్యాలయంలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. అతన్ని అరెస్టు చేసిన అనిశా అధికారులు... రేపు కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
అనిశా వలకు చిక్కిన జూనియర్ అసిస్టెంట్
TAGGED:
అనిశా వలలో ప్రభుత్వ అధికారి