కృష్ణా జిల్లా ఎ. కొండూరులోని అటవీ శాఖ సెక్షన్ గార్డు కుమారి.. అనిశా వలకు చిక్కారు. రెడ్డిగూడెం మండలం రుద్రవరం రైతు నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. చీమలపాడు సమీపంలోని పెద్ద తండాలో మామిడి తోటకు ఆర్ఓఆర్ పట్టా ఇచ్చేందుకు.. ఆమె రూ. లక్ష డిమాండ్ చేసినట్లు రైతు తెలిపారు. అనిశా అధికారులు ఆ అధికారిణిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
అనిశా వలలో ఎ.కొండూరు అటవీ శాఖ సెక్షన్ గార్డ్ - మామిడితోటకు పట్టా ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎ.కొండూరు అటవీ శాఖ సెక్షన్ గార్డు
ఓ రైతు నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటున్న.. కృష్ణా జిల్లా ఎ. కొండూరు అటవీ శాఖ సెక్షన్ గార్డు కుమారిని అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దతండాలో మామిడి తోటకు ఆర్ఓఆర్ పట్టా ఇచ్చేందుకు ఆమె రూ. లక్ష డిమాండ్ చేసిందని రుద్రవరానికి చెందిన ఆ రైతు ఆరోపించారు.

అనిశా వలలో ఎ.కొండూరు అటవీ శాఖ సెక్షన్ గార్డు