ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనిశా నివేదికతో.. వెలుగులోకి దుర్గ గుడి ఈవో తప్పిదాలు - acb report

దుర్గ గుడిలో చేపట్టిన సోదాల నివేదికను అవినీతి నిరోధక శాఖ.. ప్రభుత్వానికి సమర్పించింది. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు జరిపిన సోదాల వివరాలను నివేదికలో పేర్కొంది.

acb report on durga gudi
దుర్గ గుడి సోదాలపై అనిశా నివేదిక

By

Published : Apr 5, 2021, 3:15 PM IST

దుర్గ గుడిలో అనిశా చేపట్టిన సోదాల నివేదికలో... ఈవో సురేష్ బాబు తప్పిదాలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు దుర్గ గుడిలో అనిశా చేపట్టిన సోదాల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

ఈవో సురేష్​బాబు తీవ్ర ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారని అనిశా నివేదికలో పేర్కొంది. ఆడిట్ అభ్యంతరాలను ఈవో సురేష్​బాబు బేఖాతరు చేసి.. చెల్లింపులు చేసినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. ప్రీ ఆడిట్ అభ్యంతరాలున్నా.. ఈవో చెల్లింపులు చేసినట్లు ప్రభుత్వానికిచ్చిన నివేదికలో అనిశా వెల్లడించింది.

టెండర్లు, కొటేషన్లు, సామగ్రి ఇచ్చిన సర్క్యూలర్​కు చెల్లింపులు చేసినట్లు అనిశా గుర్తించింది. డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ జనరల్ ఇచ్చిన మార్గదర్శకాలు విరుద్ధంగా చెల్లింపులు జరిగనట్లు ఏసీబీ స్పష్టం చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్​కు ఇచ్చినట్లు గుర్తించినట్లు అనిశా నివేదికలో వెల్లడించింది. శానిటరీ టెండర్లను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని అనిశా తెలిపింది. తక్కువ సొమ్ముకే కోట్ చేసిన స్పార్క్ కంపెనీని పక్కన పెట్టారని నివేదికలో అనిశా వెల్లడించింది.

ఇదీ చదవండి:కృష్ణపట్నం పోర్టులో అదానీ గ్రూప్‌ 100% పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details