దీర్ఘకాలంగా ఏసీబీ కేసులను ఎదుర్కొంటున్న వారు, శిక్షలు పడినవారు, హైకోర్టుకు అప్పీల్‌కి వెళ్లిన వారు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో 13 జిల్లాల ఏసీబీ కేసుల బాధితులు.. తమకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.
'తమను తిరిగి విధుల్లోకి తీసుకోండి' - విజయవాడ వార్తలు
తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని ఏసీబీ కేసులను ఎదుర్కొంటున్న బాధితులు కోరారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు సాక్ష్యాలతో దిగువ కోర్టుల్లో రుజువు చేసి, అమానుషంగా తమను ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయారు.
!['తమను తిరిగి విధుల్లోకి తీసుకోండి' ACB cases Victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12498896-862-12498896-1626614881875.jpg)
రాజకీయ నాయకుల స్వలాభాపేక్ష లేదా ఇతర వ్యక్తిగత కక్షల వల్ల అవినీతి నిరోధక శాఖ దాడుల్లో చిక్కుకోవడం జరిగిందని బాధితులు తెలిపారు. నిరాధారమైన ఫిర్యాదులో ప్రాథమిక విచారణ జరపకుండా, తప్పుడు సాక్ష్యాలతో దిగువ కోర్టుల్లో రుజువు చేసి, అమానుషంగా తమను ఉద్యోగం నుంచి తొలగించి.. జీవితాలను దుర్భరం చేశారని వాపోయారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. జిల్లా, హైకోర్టులో తమపై పెండింగ్ వున్న కేసులను ఉపసంహరించి.. మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి