ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు విద్యా సంస్థల బంద్.. ఏబీవీపీ పిలుపు - bundh

విద్యా వ్యవస్థలో కార్పొరేట్  మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చామని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ తెలిపారు.

అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి

By

Published : Jun 27, 2019, 6:23 PM IST

Updated : Jun 28, 2019, 6:33 AM IST

అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ

విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావటంతోపాటు కార్పొరేట్ మాఫియా ఉండకూడదని డిమాండ్ చేస్తూ...నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చినట్లు అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ విజయవాడలో వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రైవేటు పాఠశాలలకూ వర్తింపచేస్తే మాఫియా మరింత చెలరేగుతుందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి విస్తరించిన కార్పొరేట్ మాఫియాను అరికట్టాల్సిన అవసరం ఉందని హరికృష్ణ హితవు పలికారు.

Last Updated : Jun 28, 2019, 6:33 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details