జాబ్ లెస్ క్యాలెండరును రద్దు చేసి పూర్తి స్థాయిలో అన్ని శాఖలలో ఖాళీలను భర్తీ చేసే జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ, అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నమ్మి రాష్ట్రంలోని నిరుద్యోగులంతా జగన్మోహన్ రెడ్డిని గెలిపించామని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని నిరుద్యోగ జేెేఏసీ కన్వీనర్ సాయిచరణ్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ 28న ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ, ఏబీవీపీ పిలుపు - ap job calendar updates
జాబ్ లెస్ క్యాలెండరును రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ, ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. జూన్ 28వ తేదీన విజయవాడలో ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి వారు పిలుపునిచ్చారు.
జూన్ 28న ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ ,ఏబీవీపీ పిలుపు
నిరుద్యోగులను నిరాశపరిచేలా జాబ్ క్యాలెండరు ఉందని ఏబీవీపీ నగర కార్యదర్శి శేషు అన్నారు. జూన్ 28వ తేదీన విజయవాడలో ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగ జేఏసీ, అఖిల భారత విద్యార్థి పరిషత్‌తో కలిసి ముట్టడికి పిలుపునిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి.
DRUGS: యువతరంపై మాదక ఖడ్గం