ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా - ab venkateswar rao suspension latest news

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

ab venkateswar rao case adjourned in supreme court
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

By

Published : Jan 20, 2021, 12:57 PM IST

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. తాము విధించిన సస్పెన్షన్​ను హైకోర్టు ఎత్తేయడంపై.. ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏబీని విధుల నుంచి తప్పించింది.

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మేరకు...రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

ABOUT THE AUTHOR

...view details