విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడ సారె కార్యక్రమం.. ఉత్సాహంగా జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు.. అమ్మవారికి ఆషాడ సారె సమర్పిస్తున్నారు. చీరలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, మిఠాయిలు, ఇతర వస్తువులతో అమ్మవారికి సారె అందజేస్తున్నారు.
అనంతరం ఆరో అంతస్తులోని మహామండపం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవమూర్తి వద్దకు చేరుకుని అమ్మవారి నామస్మరణతో పారాయణాలు చేస్తున్నారు. సారె సమర్పించిన భక్త బృందాలతో ఆలయ అర్చకులు పూజ చేయిస్తున్నారు.