కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ చదువుకుంటూ మురళి అనే యువకుడు స్థానికంగా టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట మహిళా ఎస్సై భర్త, మురళి ఇద్దరూ ద్విచక్ర వాహనంపై ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టుకున్నారు. ఈనేపథ్యంలో మురళీని గన్నవరం పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. విచారణ పేరుతో రాత్రంతా స్టేషన్లోనే ఉంచారని బాధిత కుటుంబం చెబుతోంది. ఈ కారణంగానే... మనస్థాపానికి గురైన మురళి ఈరోజు ఉదయం గన్నవరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు చెరువులో గాలించి మురళీ మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేశారు.
యువకుడి ఆత్మహత్య.. పోలీసులే కారణమా? - young man suicide news in gannavaram
గన్నవరంలో ఓ యువకుడి ఆత్మహత్య వివాదంగా మారుతోంది. విచారణ పేరుతో రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచిన కారణంగానే.. ఇలా జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
a young man suicide in gannavaram