ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలకాయతిప్ప బీచ్​లో యువకుడు మృతి.. - కృష్ణా జిల్లా పాలకాయతిప్ప బీచ్​లో ఓ యువకుడు గల్లంతు తాజా వార్తలు

కృష్ణా జిల్లాలోని పాలకాయతిప్ప బీచ్​లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ధాటికి వంశీకృష్ణ అనే యువకుడు గల్లంతవ్వటంతో.. మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.

A young man drowns at Palakayatippa beach at krishna district
పాలకాయతిప్ప బీచ్​లో ఓ యువకుడు గల్లంతు.. గాలిస్తున్న పోలీసులు

By

Published : Dec 13, 2020, 7:34 PM IST

సరదా కోసం సముద్ర తీరానికి వస్తే విషాదాన్ని మిగిల్చిన ఘటన.. కృష్ణా జిల్లా పాలకాయతిప్ప బీచ్​లో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలకు చెందిన వంశీకృష్ణ.. కుటుంబసభ్యులతో కలిసి కార్తిక స్నానాలకు సముద్రానికి వచ్చారు. అందరూ స్నానాలు చేస్తుండగా అలల తాకిడికి వంశీకృష్ణ గల్లంతయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న మెరైన్‌ పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. తమతో పాటే అప్పటివరకు సరదాగా గడిపి.. ఒక్కసారిగా విగతజీవిగా కనిపించటంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

ABOUT THE AUTHOR

...view details