ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరుసగా ఇద్దరు ఆత్మహత్య..కారణమేంటి? - కృష్ణా జిల్లా నేర వార్తలు

యువతీయువకుల ఆత్మహత్యలు ఆ గ్రామంలో కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా... ఇవాళ యువతి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన వీరపల్లి పోలీసులు.. ఈ ఘటనలపై దర్యాప్తు చేపట్టారు.

a young man and girl suicide at Ramanna Gudem
యువతీయువకుల వరుస ఆత్మహత్యలు

By

Published : Apr 10, 2021, 5:23 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువతీయువకుల ఆత్మహత్యలు ఆ గ్రామంలో కలకలం రేపుతున్నాయి. గ్రామానికి చెందిన కొలుసు నాగరాజు(27).. కుటుంబ కలహాల కారణంగా శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదే గ్రామానికి యువతి ధర్మవరపు నాగశివ(21) ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది.

అయితే యువతికి ఇటీవలే కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. గ్రామంలో ఆ ఇద్దరి ఆత్మహత్యలపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన వీరవల్లి పోలీసులు.. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details