కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మెల్లంపూడి వెంకట్రావమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తోన్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొని మహిళ మృతి - women died in anasagaram road accident
రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా అనాసాగరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదం
Last Updated : Oct 7, 2019, 10:03 AM IST