తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సహా వెస్ట్ సీఐతో తమకు ప్రాణహాని ఉందని తిరుపతికి చెందిన ఐతేపల్లి విద్య ఆరోపించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన విద్య..తిరుపతిలో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవించే తనపై మహిళా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడుతూ బలవంతంగా సొమ్ము వసూలు చేశారని తెలిపారు. వ్యాపార అవసరాల నిమిత్తం ఓ డాక్టర్ వద్ద అప్పుగా తీసుకున్న 7 లక్షల రూపాయలు చెల్లించలేదని... సదరు డాక్టర్ తనపై స్పందనలో ఫిర్యాదు చేశారని అప్పటినుంచి వెస్ట్ సర్కిల్ సీఐ తనపై అక్రమ కేసులు బనాయిస్తూ 5 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా తమకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా... బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తమ గోడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా కానిస్టేబుల్, సీఐ అడ్డుపడుతున్నారని తమకు న్యాయం చేయమని విద్య కోరుతోంది.
సీఐ బెదిరిస్తున్నారని ఓ మహిళ ఆవేదన - latest new of tirupati west policstation vidhya story
తనకు ప్రాణహాని ఉందని... సీఐ, కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళ విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాకు వివరించింది. అక్రమ కేసులు బనాయిస్తూ కోట్లలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది తిరుపతికి చెందిన విద్య.

వివరాలు చెపుతున్న బాధితురాలు
వివరాలు చెపుతున్న బాధితురాలు