ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Heavy rain in Bengaluru : బెంగళూరులో భారీ వర్షం.. విజయవాడకు చెందిన ఐటీ ఉద్యోగిని మృతి - Heavy rains in Bangalore

బెంగళూరులో భారీ వర్షాలు
బెంగళూరులో భారీ వర్షాలు

By

Published : May 21, 2023, 6:02 PM IST

Updated : May 21, 2023, 9:48 PM IST

17:56 May 21

బెంగళూరులో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న భానురేఖ

బెంగళూరులో భారీ వర్షాలు

Heavy rains in Bangalore : అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన వడగళ్ల వర్షం.. సుమారు గంటకు పైగా దంచికొట్టింది. ఈదురు గాలుల ధాటికి చెట్లు కూలి పలుచోట్ల వాహనాలు ధ్వంసం కాగా, కేఆర్‌ సర్కిల్‌లో అండర్ పాస్​లో వరద ముంచెత్తింది. వాహనాల్లో చిక్కుకున్న వారిని స్థానికులు, పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతి చెందిన మహిళ.. విజయవాడకు చెందిన భాను రేఖగా గుర్తించారు. కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లగా ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యారు. వరద ముంచెత్తిన సమయంలో కారులో భానురేఖతో పాటు కుటుంబ సభ్యులు ఆరుగురు ఉండగా.. వారిని పోలీసులు, స్థానికులు కాపాడారు. అప్పటికే భానురేఖ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది.

పరిహారం ప్రకటించిన సీఎం సిద్ధ రామయ్య... బెంగళూరు ఆస్పత్రిని కర్నాటక సీఎం సిద్ధరామయ్య సందర్శించారు. భానురేఖ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు.

ధ్వంసమైన వాహనాలు... భారీ వర్షం కారణంగా బెంగళూరు నగరంలోని నగరసౌధ, ఆనంద్‌రావు, మెజెస్టిక్‌, రేస్‌ కోర్స్‌, కేఆర్‌ సర్కిల్‌, టౌన్‌ హాల్‌, కార్పొరేషన్‌, మైసూర్‌ బ్యాంక్‌ సర్కిల్‌, జయనగర్‌, మల్లీశ్వర్‌ ప్రాంతాలను వరద ముంచెత్తింది. పలు చోట్ల వాహనాలు రోడ్డు పక్కనే పార్కింగ్‌ చేయగా.. భారీ వృక్షాలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. రేస్ కోర్స్ రోడ్డుపై ఓ లగ్జరీ కారు నుజ్జునుజ్జయింది. కుమార్ కృపా రోడ్డులోని చిత్రకళా పరిషత్ ఎదురుగా కారు, బైక్ పై భారీ వృక్షం పడి వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ఇవీ చదవండి :

Last Updated : May 21, 2023, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details