కృష్ణా జిల్లా మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో మల్లాది మరియమ్మ అనే మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నిన్న రాత్రి మేకల కాపరులు ఆమె మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మైలవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న మధ్యాహ్నం మరియమ్మ కొబ్బరి తోటకి వెళ్లినట్లు బంధువులు తెలిపారు.
మైలవరంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - కృష్ణా జిల్లాలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి
కృష్ణా జిల్లా మైలవరంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. మేకల కాపరులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అనుమానస్పద స్థితిలో మహిళ మృతి