ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన మేనమామ

రెండు నెలల పసిపాపను సొంత మేనమామ కిడ్నాప్ చేశాడు. అది కూడా అత్యంత అమానుషంగా చిన్నారిని బ్యాగ్​లో తీసుకువెళ్లి ముళ్లపొదల్లో దాచాడు. పోలీసులు సకాలంలో స్పందించటంతో పాప ప్రాణాలతో దక్కిందని డీసీపీ వెల్లడించారు.

కిడ్నాప్

By

Published : Sep 30, 2019, 11:20 PM IST

Updated : Sep 30, 2019, 11:49 PM IST

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ హర్షవర్ధన్

డబ్బు కోసం సొంత మేనమామ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన విజయవాడలో సంచలనం స్పష్టించింది. రెండు నెలల వయసున్న ధాత్రి అనే చిన్నారిని డబ్బు కోసం వరుసకు మేనమామ అయిన అయిన అఖిల్(17) ఈ రోజు మధ్యాహ్నం కిడ్నాప్ చేశాడని డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని యనమలకుదురుకు చెందిన చల్లా కమల కుమారి తన కుమార్తె కనిపించటం లేదంటూ ఈరోజు మధ్యాహ్నం కనుమూరి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే అప్రమత్తమయ్యారు. చుట్టు పక్కల అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. సాయంత్రం 7 గంటల సమయానికి సీసీ కెమెరాల సాయంతో నిందితుడైన అఖిల్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అతని నుంచి సేకరించిన సమాచారం మేరకు ఓ ముళ్ల పొదల్లో ఉన్న చిన్నారిని సకాలంలో పోలీసులు రక్షించారు. అనంతరం పాపను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని.. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని డీసీపీ తెలిపారు. నిందితుడు చిన్నారిని ఓ బ్యాగ్​లో పెట్టుకుని తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు. అఖిల్​పై కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Last Updated : Sep 30, 2019, 11:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details