రాజధాని కోసం ప్రాణాలు కోల్పోయిన రైతులకు అమరావతి పరిరక్షణ సమితి నివాళులర్పించింది. విజయవాడ రాణిగారి తోటలో సమావేశమైన నేతలు... ముందుగా పట్టణంలో భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఇటీవల పోలీసుల తోపులాటలో గాయపడిన మహిళకు రూ.30 వేలు ఆర్థిక సాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు.
అమరావతి కోసం ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఘన నివాళి - అమరావతి అమరవీరులు
విజయవాడ రాణిగారి తోటలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి కోసం ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.
![అమరావతి కోసం ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఘన నివాళి రైతులకు ఘన నివాళి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5730745-75-5730745-1579173735712.jpg)
రైతులకు ఘన నివాళి