విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రహరీకి సమీపంలో భారీ వృక్షం కూలింది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పడటంతో రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. కూలిన చెట్టును తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఏళ్ల నాటి చెట్టు ఒక్కసారిగా కూలడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై చెత్తను... చెట్ల వద్దే కాల్చడం వల్లే .. ఆ వేప చెట్టు కూలిందని కేసరపల్లి గ్రామస్థులు అరోపిస్తున్నారు.
విజయవాడ విమానాశ్రయం ప్రహరీ సమీపంలో కూలిన భారీ వృక్షం - విజయవాడలో కూలిన వేపచెట్టు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రహరీకి సమీపంలో భారీ వృక్షం కూలింది. చెట్టుపడటంతో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనాలకు అంతరాయం ఏర్పడింది.
విజయవాడ విమానాశ్రయం ప్రహరీకి సమీపంలో కూలిన భారీ వృక్షం