చొక్కా కోసం అన్నదమ్ముల మధ్య వివాదం.. విద్యార్థి ఆత్మహత్య - krishna district crime
11:51 December 17
చొక్కా కోసం అన్నదమ్ముల మధ్య వివాదం.. విద్యార్థి ఆత్మహత్య
అన్నదమ్ముల మధ్య చొక్కా విషయంలో మొదలైన వివాదంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ముత్రాసిపాలెంలో ముచ్చు నాగతేజ అనే పదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన సోదరునితో షర్టు విషయంలో గొడవ పడిన విద్యార్థి పొలాల్లో పురుగుల మందు తాగి చనిపోయాడు. నాగతేజ కనుమూరు ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: