కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ సమీపంలోని కృష్ణానదిలో మునిగి ఓ విద్యార్థి మృతి చెందాడు. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి కొవిడ్-19 పరీక్షల కోసం వచ్చిన 9 మంది విద్యార్థులు పక్కనే ఉన్న కృష్ణానదిలో స్నానం చేయడానికి వెళ్లారు. ఈత కొడుతూ.. ఉండగా కొడాలికి చెందిన పోరంకి జయ కిరణ్అ నే విద్యార్థి ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయాడు. అయితే కిరణ్ ఆచూకీ కోసం స్థానికులు నదిలో గాలింపు చేపట్టగా మృతదేహం దొరికింది. కేసు నమోదు చేసిన ఘంటసాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో మునిగి విద్యార్థి మృతి - Krishna district latest crime news
స్నానం చేయడానికి కృష్ణా నదిలోకి దిగిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో జరిగింది.
![ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో మునిగి విద్యార్థి మృతి a student dies after drowned in the Krishna river](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9471382-429-9471382-1604768884119.jpg)
కృష్ణా నదిలో మునిగి విద్యార్థి మృతి