విజయవాడలో ఓ యువకుడు పార్ట్ టైం ఉద్యోగం కోసం ఆన్లైన్ సైట్లలో వెతికాడు. రోజుకు 2 నుంచి 3 గంటలు పని చేస్తే చాలు... తక్కువ రోజుల్లో 8వేల రూపాయలు సంపాధించవచ్చనే ప్రకటన చూశాడు. ముందుగా రూ. 3 వేలు చెల్లించాలన్న నిబంధన ప్రకారం... నగదు వారి ఖాతాలో వేశాడు. సొమ్ము అందుకున్న సదరు సంస్థ నుంచి ఇంత వరకు స్పందన లేదు. సెల్ స్విచ్ ఆఫ్ చేసేశాడు.
45 లక్షల రూపాయలు గెలుచుకున్నారనే సందేశం వచ్చింది ఇంకో వ్యక్తి. సందేశం కింద ఉన్న లింక్ నొక్కితే ఓ అప్లికేషన్ వచ్చింది. ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు అన్నీ ఇచ్చేశాడు. వెంటనే బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి నగదు మాయమైంది. చివరికి మోసం చేసుకున్న బాధితుడు తల పట్టుకున్నాడు
మనిషి బలహీనతే ఎదుటి సైబర్ నేరగాళ్ల ఆయుధం. రూ.60వేల విలువైన ఫోన్ కేవలం రూ. 20 వేలకే వస్తుందని ప్రకటన చూసి ఓ మహిళ సదరు నెంబర్‌కు ఫోన్ చేసింది. అతన్ని కలిసి రూ. 5 వేలు ఇచ్చింది. అంతే మళ్లీ వస్తానని చెప్పి ఇంతవరకు కనిపించకుండా పోయాడు. ఫోన్ ఎప్పటిలాగానే స్విచ్ఛాఫ్.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వలవేసి డబ్బు వసూలు చేసే ఘటనలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లకు నిరుద్యోగులే గురి. మీ బయోడేటా షార్ట్ లిస్ట్‌లో ఎంపికైందని... మరో రౌండ్ ముందుకెళ్లాలంటే మూడు వేలు చెల్లించాలంటూ వల వేస్తారు. బాధితుల నుంచి అందినంత దోచుకుంటారు.
ఇంత జరుగుతుంటే పోలీసులు ఏంచేస్తున్నారు?