వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావటం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అధినేత చంద్రబాబుతో రాయపాటి సమావేశమయ్యారు. తన కూమారుడ్ని సత్తెనపల్లి ఇంఛార్జిగా నియమించమని చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు. సత్తెనపల్లిలో తమకు మంచి పట్టు ఉందని, తమ కుమారుడు, కుమార్తె ఇద్దరూ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తన కుమార్తె అమరావతి ఉద్యమంలో పాల్గొంటోందని వివరించారు.
Rayapati: వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వచ్చి తీరుతుంది: రాయపాటి
రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబంలో ఒకరికి సీటు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు తెదేపా సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు. విజయవాడలోని ఎన్టీఆర్ భవనంలో బుధవారం ఆయన చంద్రబాబు నాయుడ్ని కలిశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఒకరికైతే తప్పనిసరిగా సీటు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను వెనకుండి వారిని గెలిపిస్తానన్నారు. రాజకీయాల నుంచి ప్రస్తుతానికి ఆయన రిటైర్ అయినట్లు తెలిపారు. రేపు ఏం జరుగుతుందో తెలీదని అభిప్రాయపడ్డారు. పార్టీకి మంచి అభ్యర్థులు కావాలని సూచించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన చాలా మంది మళ్లీ వెనక్కి రావాలని కోరారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : MINISTER SURESH: 'రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు'