బస్సులో చేతులు బయటపెట్టి ప్రయాణం..వేరే వాహనం ఢీకొని తీవ్రగాయాలు - Accident due to hands getting out of the bus in nandhigama
బస్సులో ప్రయాణించేటప్పుడు చేతులు బయటపెట్టవద్దని హెచ్చరించినా కొంతమంది పెడచెవిన పెడతారు. ఆ ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కానీ కొన్నిసార్లు ఇలాంటి చిన్న పొరపాట్లే ప్రాణాల మీదికి తెస్తుంది. ఇలాంటి ఘటనే కృష్ణాజిల్లా నందిగామలో జరిగింది.
రోడ్డు ప్రమాదం
కృష్ణాజిల్లా నందిగామలోని అశోక్ నగర్ జకరయ్య హోటల్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి విండోలో చేతులు పెట్టి ప్రయాణిస్తున్నాడు. పక్కన వెళ్తున్న స్కూల్ బస్సు.. వేగంగా అతని చేతులను తాకింది. దీంతో అతని చేతికి తీవ్రగాయమై రక్తస్రావం జరిగింది. హుటాహుటిన చేరుకున్న 108 సిబ్బంది.. బాధితుడిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.