కృష్ణా జిల్లా నందిగామ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న ఓ వ్యక్తి అర్దరాత్రి సమయంలో మృతి చెందాడు. ఈ నెల 8 వ తేదీన కొనాయపాలేనికి చెందిన జిల్లపల్లి నరసింహారావు (61) మద్యం అక్రమ రవాణా కేసులో పోలీసులకు పట్టుపడ్డాడు. అతన్ని కోర్టు లో పోలీసులు హాజరు పరుచారు. అతనికి కోర్టు రిమాండ్ విధించింది. దాంతో నందిగామ సబ్ జైల్లో ఉన్నాడు.
నందిగామ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి - కృష్ణా జిల్లా
నందిగామ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న ఓ వ్యక్తి అర్ధరాత్రి మృతి చెందాడు. అక్రమ మద్యం కేసులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ మృతి
అర్ద రాత్రి సమయంలో ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అతన్ని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఇదీ చదవండి:Gang Rape: గుంటూరు సామూహిక అత్యాచార ఘటనలో ఆ వార్తలు అవాస్తవం: డీఐజీ