అత్యంత అరుదైన శేషాచలం, నల్లమల అడవుల్లో కనిపించే పునుగుపిల్లి కృష్ణా జిల్లాలో ప్రత్యక్షమైంది. జిల్లాలోని తోట్లవల్లూరు మండలం దేవరపల్లికి చెందిన జొన్నల వెంకటరెడ్డి ఆదివారం రాత్రి కృష్ణానది ఒడ్డున ఉన్న పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు. ఆయన మోటారు ఉన్న వరల వద్దకు వెళ్లగా పునుగుపిల్లి కనిపించింది. దీంతో గ్రామస్థుల సహకారంతో దానిని జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి బోనులో ఉంచారు. సోమవారం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా ఇటీవల కృష్ణానది వరదలకు అది కొట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
కృష్ణా జిల్లాలో అరుదైన పునుగు పిల్లి - A rare punugu cat has been spotted in Krishna district.
కృష్ణా జిల్లాలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. శేషాచలం, నల్లమల అడవుల్లో కనిపించే ఈ పునుగుపిల్లి...వరదలకు కొట్టుకొచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
కృష్ణా జిల్లాలో అరుదైన పునుగు పిల్లి