అజ్మీర్ యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రాష్ట్రానికి వస్తున్న 45మందిని పోలీసులు కృష్ణా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద నిలిపివేశారు. ఈ నెల 14న యాత్రకు బయలుదేరిన వీరు రైళ్లు రద్దవడంతో ప్రైవేట్ బస్సులో రాష్ట్రానికి వస్తున్నారు. గుంటూరుకు చెందిన 41 మంది, విజయవాడకు చెందిన ఇద్దరు, మచిలీపట్నంకు చెందిన ఇద్దరు ప్రయాణికులు బస్సులో ఉన్నారు. వీరందరికీ పరీక్షలు చేసి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గరికపాడు చెక్పోస్ట్ వద్ద అజ్మీర్ యాత్ర బస్సు నిలిపివేత - lock down vijayawada latest updats
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద 45 మందితో గుంటూరు వెళ్తోన్న ప్రైవేట్ బస్సును పోలీసులు నిలిపివేశారు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరికీ పరీక్షలు చేసిన తరువాతే రాష్ట్రంలోకి పంపుతామని అధికారులు తెలిపారు.
గరికపాడు చెక్పోస్ట్ వద్ద అజ్మీర్ యాత్ర బస్సు నిలిపివేత